BCCL Recruitment 2024: బీసీసీఎల్‌లో 37 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

జార్ఖండ్‌లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌(బీసీసీఎల్‌).. మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 37
విభాగాలు: సర్జన్,జనరల్‌ ఫిజిషియన్, గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్ట్రెటీషియన్, ఆర్ధోపెడిషియన్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్,పల్మాలజిస్ట్‌/చెస్ట్‌ స్పెషలిస్ట్,ఆప్తా ల్మాలజిస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియాలజిస్ట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల­కు 42 ఏళ్లు, మెడికల్‌ స్పెషలిస్ట్‌/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.70,000 నుంచి రూ.2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జీఎం/హెచ్‌వోడీ(ఈఈ), భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ దగ్గర, కోయలా భవన్, కోయలా నగర్, ధన్‌బాద్, జార్ఖండ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.

వెబ్‌సైట్‌: https://www.bcclweb.in/

చదవండి: CIL Recruitment 2024: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో 32 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags