AP LAWCET 2023: ఏపీ లాసెట్‌ 2023 ఫలితాలు... డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయశాస్త్ర కళాశాలల్లో 2023 విద్యా సంవత్సరంలో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన‌ ఏపీ లాసెట్ ఫ‌లితాలు జూన్ 16వ తేదీన విడుద‌ల‌య్యాయి. లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌ పరీక్షల ఫలితాలను  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ విడుదల చేశారు.
ఏపీ లాసెట్‌ 2023 ఫలితాలు... డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

ఏపీలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించారు. ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203 మంది హాజరు కాగా.. వారిలో 13,402 మంది క్వాలిఫై అయినట్లు వీసీ వెల్లడించారు.

మొదటి విడత అడ్మిషన్లు ఆగస్టు 16–24 వ‌తేదీ వరకు, రెండో విడత అడ్మిషన్లు అక్టోబర్‌ 1–7 వరకు, స్పాట్‌ అడ్మిషన్లు, కేటగిరీ–బి అడ్మిషన్లు అక్టోబర్‌ 15–22 వరకు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. తరగతులు అక్టోబర్ 11వ తేదీ నుంచి మొదలయ్యే చాన్స్ ఉంది.

                               ఏపీ లాసెట్‌ 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

#Tags