TS LAWCET 2024 Notification: టీఎస్ లాసెట్-2024 షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులకు చివరితేది ఇదే..
కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హతలు
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. వీరు బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీకామ్+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ చేసే అవకాశం ఉంది.
పరీక్ష మాధ్యమం: లాసెట్ ఇంగ్లిష్/తెలుగు, పీజీఎల్‌సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుం లేకుండా): 15.04.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుంతో): 25.05.2024
పరీక్ష తేదీ: 03.06..2024
వెబ్‌సైట్: https://lawcet.tsche.ac.in/
కోర్సు అనంతరం
లా కోర్సు పూర్తిచేసిన తర్వాత న్యాయవాద వృత్తి చేపట్టాలంటే..‘ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్’లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకోవాలి.
కెరీర్
న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. లా పూర్తిచేసిన తర్వాత లీగల్ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్ మేనేజర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి హోదాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
- లా డిగ్రీ ఉత్తీర్ణులయ్యాక టీచింగ్ పట్ల ఆసక్తి ఉంటే.. లీగల్ ఫ్యాకల్టీగా లా కాలేజీల్లో పనిచేయవచ్చు. అంతేకాకుండా పీజీ, ఎల్‌ఎల్‌ఎం వంటి వాటికి కూడా ప్రిపర్ కావచ్చు.