TS Lawcet 2024: లాసెట్–2024 పరీక్ష తేదీ ఇదే..
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం పొందవచ్చని లాసెట్–2024 కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు వయోపరిమితితో సంబంధం లేకుండా ఐదేళ్ల లాసెట్–2024లో అర్హత సాధించి ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు. గురువారంతో ముగియనున్న లాసెట్–2024కు ఆసక్తి గల ఇంటర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్ | కరెంట్ అఫైర్స్ | జనరల్ నాలెడ్జ్
రూ.500 ఆ పైన అపరాధ రుసుముతో మరి కొన్ని రోజులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. లాసెట్–2024, ఎల్‌ఎల్‌ఎం సెట్ ప్రవేశ పరీక్షలను జూన్ 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
#Tags