Nurse Posts: స్విమ్స్‌ ఆస్పత్రుల్లో నర్సు పోస్టుల భర్తీ

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మెనెంట్‌ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తమ నిర్ణయాన్ని వెల్లడించారు..

తిరుమల: స్విమ్స్‌ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు 479 నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు చైర్మన్‌ భూమనకరుణాకరరెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

AI Work Shop: ఆర్టిఫీషియల్‌ ఇంటలిజన్స్‌నై వర్క్‌ షాప్‌ ప్రారంభం

ఉద్యోగులపై భూమన ‘కరుణ’

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.114ను టీటీడీలో అమలు చేయడానికి ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ చైర్మన్‌ శ్రీభూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీవో అమలులో ఎదురైన ఇబ్బందులను అదిగమిస్తూ 2014 జూన్‌ 2వ తేదీకి ముందు టీటీడీ అవసరాల కోసం బోర్డు తీర్మానాల ద్వారా (నోటిఫికేషన్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ లేకుండా) చేరిన కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడానికి అనుమతించాలని కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

#Tags