AI Work Shop: ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్‌నై వర్క్ షాప్ ప్రారంభం
Sakshi Education
ట్రిపుల్‌ఐటీడీఎం లో నిర్వహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై వర్క్‌షాప్‌ను సోమవారం పలువురు అధికారులు, ముఖ్య అతిథులు ప్రారంభించారు. ఈ వేదికలో వారంతా మాట్లాడుతూ..

కర్నూలు సిటీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ (ట్రిపుల్‌ఐటీడీఎం)లోని మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం రోబోల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై వర్క్‌షాపు ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపును డీఆర్‌డీఓ శాస్త్రవేత్త (పూణే) డాక్టర్ కిరణ్ ఆకెళ్ల, ట్రిపుల్‌ఐడీడీఎం డైరెక్టర్ డీవీఎల్‌ఎన్ సోమయాజూలు ప్రారంభించారు.
Agniveer Posts: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోబోల తయారీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఏఐ విభాగంలో పరిశోధనలు చేసే విద్యార్థులకు వారం రోజుల పాటు జరిగే వర్క్ షాపు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వర్క్‌షాపు కో–ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ మండవ తదితరులు పాల్గొన్నారు.
Published date : 12 Mar 2024 02:47PM