TSSC Mission: మానవ వనరుల కొరత తగ్గించాలని లక్ష్యం.. 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..
సాంకేతిక రంగం ముఖ్యంగా 5జీ ప్రారంభంతో టెలికం పరిశ్రమలో నిపుణులు, నైపుణ్యం లేని, తిరిగి నైపుణ్యం కలిగిన వారికి అధిక డిమాండ్‌ని కలిగి ఉంది. టెలికంలో పెరుగుతున్న ఈ డిమాండ్‌ను మనం చూస్తున్నందున ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు డిజిటల్, కీలక టెలికం, సాంకేతిక నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీఎస్‌ఎస్‌సీ సీఈవో అరవింద్ బాలి తెలిపారు.
భారత్‌లో మూడవ అతిపెద్ద పరిశ్రమ అయిన టెలికం రంగం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహంలో దాదాపు 6.5 శాతం వాటా కలిగి ఉంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 5జీ చందాదార్లలో భారత్ 11 శాతం వాటా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నట్లు బాలి చెప్పారు. టెలికం రంగంలో నియామకాలను సులభతరం చేయడానికి ఉద్ధేశించిన టెక్కోజాబ్స్ వేదికగా 2.5 లక్షల మంది అభ్యర్థులు, 2,300 కంపెనీలు నమోదు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.