TOMCOM: విదేశీ ఉద్యోగాలకు 5న ఎన్‌రోల్‌మెంట్‌

కాళోజీ సెంటర్‌ : విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ఆధ్వర్యంలో ఈనెల 5న ములుగురోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎన్‌రోల్‌మెంట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్‌.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా, జర్మనీ, హంగేరి, జపాన్‌, పోలాండ్‌, రుమేనియా, యూకే వంటి దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ నమోదిత ఏజెన్సీలతో టామ్‌కామ్‌ భాగస్వామ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు అధిక డిమాండ్‌ ఉందని తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతంతోపాటు అభ్యర్థులకు సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేస్తుందని వివరించారు. మైనింగ్‌ ఇండస్ట్రీ, ప్లాంట్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెకాని కల్‌ ఇంజనీర్‌, కన్వేయర్‌ బెల్ట్‌ టెక్నీషియన్‌, వెల్డర్‌, ఐటీఐ, డిప్లొమా, ఎలక్ట్రికల్‌ గ్రాడ్యుయేట్‌, లేదా మీ ట్‌ ప్రాసెసింగ్‌, ఫుడ్‌ రిటైల్‌ సేల్స్‌, కన్‌స్ట్రక్షన్‌, సాంకేతిక రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. వివరాలకు www. tomcom. recruitmentmanager@ gmail. com సైట్‌ లేదా 9701732697, 7893566493, 8328602231 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

PM Shri Scheme: పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 41 పాఠశాలలు ఎంపికయ్యాయి

ఎంసీఏ రెండో సెమిస్టర్‌ పరీక్షలు
కేయూ క్యాంపస్‌ : ఎంసీఏ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ (సీబీసీఎస్‌ రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) పరీక్షలు ఈనెల 9 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాఽధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9, 11, 14, 16, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 

#Tags