Skills Necessary in Corporate Life: మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.. సాంకేతికతలలో ఉద్యోగులకు నైపుణ్యం లేకుండా పోవడమే అని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎవరైతే.. నైపుణ్యం పెంచుకుంటారో వారికే భవిష్యత్తు ఉంటుందని స్టేట్ ఆఫ్ అప్‌స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే ద్వారా తెలిసింది.

2023తో పోలిస్తే.. 2024లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిసింది. కెరీర్‌లో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా అవసరమని ఉద్యోగులకు అర్థమవుతోంది. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాల కోసం నైపుణ్యం ఒక ముఖ్యమైన అంశం అని భావిస్తున్నారు.

డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి వాటిలో నైపుణ్యం సంపాదిస్తున్నారు.

ఉద్యోగంలో ఎదగాలంటే ఇవి ఉండాల్సిందే..
ఎప్పటికప్పుడు మారుతున్న ల్యాండ్‌స్కేప్‌లో.. ఎదగాలంటే డేటా సైన్స్, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం అవసరమని సింప్లిలేర్న్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కాబ్బటి ఉద్యోగులు తమ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను తప్పకుండా పెంపొందించుకోవాలి.

Nikesh Arora: ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!.. ఎవరీ నికేశ్‌ అరోరా

లింక్‌డ్‌ఇన్‌ ప్రకారం ప్రస్తుత కార్పోరేట్‌ లైఫ్‌లో టాప్‌ స్కిల్స్‌ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపింది. మంచి కమ్యూనికేషన్‌తో పాటు కస్టమర్‌ సర్వీస్‌ గురించి అవగాహన ఉన్నవాళ్లకు డిమాండ్‌ ఎప్పటికీ తగ్గదని తెలిపింది. అలాగే టీంను నడిపించే నాయకత్వ లక్షణాలు/అనుభవం, కీలకమైన ప్రాజెక్టులను నిర్వహించిన సామర్థ్యం, వేర్వేరు టాప్‌ పొజిషన్లలో చేసిన నైపుణ్యం ఉన్నవారికి ఢోకా లేదని తెలిపింది.

నెంబర్లను విశ్లేషించి వ్యూహాలను మార్చుకునే అనలిటిక్స్‌ స్కిల్‌, ఎలాంటి బృందంతోనైనా పని చేసే కలుపుగోలు మనస్తత్వం, దేన్నయినా విక్రయించే టాలెంట్‌, సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే ట్రబుల్‌ షూటింగ్‌ పరిజ్ఞానం అలాగే లోతైన పరిశోధన అభ్యర్థులను అగ్రస్థానంలో ఉంచుతుందని తెలిపింది. 

#Tags