NCERT Recruitment 2024: ఎన్‌సీఈఆర్‌టీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT),డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 123 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 123
ఖాళీల వివరాలు
ప్రొఫెసర్: 33
అసోసియేట్ ప్రాఫెసర్: 58
అసిస్టెంట ప్రొఫెసర్/అసిస్టెంట్ లైబ్రేరియన్: 32
TG B.Arch. 2024 Admissions: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశాలు.. షెడ్యూల్ విడుదల
అర్హత: సంబంధిత పోస్టును బట్టి పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్/స్లెట్/సెట్ స్కోరుతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి
దరఖాస్తు ఫీజు: రూ. 1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
వేతనం: ప్రొఫెసర్ పోస్టుకు రూ. 1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ. 1,31,400 అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ. 57,000 ఉంటుంది
ఎంపిక విధానం: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 16, 2024