NABARD Recruitment 2024 Notification: నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే

నాబార్డు(National Bank For Agriculture And Rural Development) దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 102 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 102
ఖాళీల విభాగాలు

జనరల్: 50 పోస్టులు
చార్టర్డ్ అకౌంటెంట్: 04 పోస్టులు
ఫైనాన్స్: 07 పోస్టులు
కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 16 పోస్టులు
అగ్రికల్చర్: 02 పోస్టులు
యానిమల్ హస్బెండరీ: 02 పోస్టులు
ఫిషరీస్: 01 పోస్టు
ఫుడ్ ప్రాసెసింగ్: 01 పోస్టు
ఫారెస్ట్రీ: 02 పోస్టులు
ప్లాంటేషన్ అండ్‌ హార్టికల్చర్: 01 పోస్టు
జియో ఇన్ఫర్మేటిక్స్: 01 పోస్టు
డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్: 03 పోస్టులు
స్టాటిస్టిక్స్: 02 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్: 03 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ సైన్స్: 02 పోస్టులు
హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌: 02 పోస్టులు
రాజ్‌భాష: 02 పోస్టులు

అర్హత: సంబంధిత పోస్టును బట్టి 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయస్సు: జులై1 నాటికి 21-30 ఏళ్లకు మించకూడదు

దరఖాస్తు ఫీజు: రూ. 850 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక విధానం: ‍రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల​ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 15, 2024
 

#Tags