Job Opportunities In Abroad: విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పరిధిలోని రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్ కామ్) ద్వారా 20 దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. యూకే, యూఎస్‌ఏ, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, గ్రీస్, యూఏఈ తదితర దేశాల్లో వివిధ సెక్టార్లలోని పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
టామ్‌కామ్ ద్వారా రిజిస్టర్డ్ నర్స్, వృద్ధుల సంరక్షణ నర్స్, హెల్త్ కేర్ అసిస్టెంట్, ఆటోమోటివ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, హెవీ మోటా ర్ వెహికల్ డ్రైవర్, ఫుడ్ డెలివరీ సిబ్బంది, కార్పెంటర్లు, హాస్పిటాలిటీ (హౌస్ కీపింగ్, వెయిటర్లు, కిచెన్ స్టాఫ్, గార్డెనర్), భవన నిర్మాణ రంగాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులకు ఆయా దేశాల భాషలు నేర్పించడంతోపాటు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, జీఎన్‌ఎం, నర్సింగ్ వంటి అర్హతలున్న 18–45 ఏళ్ల వయసువారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు టామ్‌కామ్ 94400 51452/94400 49861/99519 09863 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Certificate Course: మహిళలకు ఉచితంగా నాన్ వాయిస్ సర్టిఫికెట్ కోర్సు..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags