Job Mela 2024: గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా? రేపే జాబ్‌మేళా, ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి
జనగామ రూరల్: కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 15న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ కంపెనీ హనుమకొండ ఆధ్వర్యంలో బీజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, మేనేజర్ పోస్టులు మొత్తం 20 ఖాళీలు ఉన్నాయన్నారు.
TS LAWCET 2024 Results Out: లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత.. హైదరాబాద్ వాసికి ఫస్ట్ ర్యాంక్
డిగ్రీ అర్హతతో 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని, సంబంధిత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో శనివారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7995430401 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
#Tags