Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా.. 40 కంపెనీల్లో ఖాళీలు
మహబూబాబాద్ రూరల్: నిరుద్యోగ యువతీ యువకులు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగాజాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మెగాజాబ్‌మేళా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 8న మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేశామని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Dussehra Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి దసరా సెలవులు
త్రెడ్జ్ ఐటీ గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 40 కంపెనీలకు పైగా పొల్గొంటాయని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.12వేలు ఉంటుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అండ్ ఫార్మసీ తదితర విద్యార్హత కలిగిన వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
Scholarship Program: పీఎం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి
జాబ్ మేళాకు హాజరయ్యే వారు వాల్ పేపర్‌లోని స్కానర్‌ను స్కాన్ చేస్తే బయోడేటా ఫామ్ వస్తుందని, అందులో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. బయోడేటా ఫామ్‌తో పాటు జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావా లన్నారు. అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్, బయ్యారం, రూరల్ సీఐలు దేవేందర్, రవి, సరవయ్య, ఎస్బీ సీఐ చంద్రమౌళి, త్రెడ్జ్ ఐటీ గ్రూమింగ్ ఎక్సలెన్స్ బాధ్యులు పాల్గొన్నారు.
జాబ్‌మేళా ముఖ్యమైన సమాచారం:
ఎప్పుడు: అక్టోబర్ 08
ఎక్కడ: మహబూబాబాద్ పోలీస్ కార్యాలయంలో
అర్హత: 10వ తరగతి, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అండ్ ఫార్మసీ
వేతనం: రూ.12వేలు
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)