Job Mela: ఈనెల 9న జాబ్‌మేళా.. నెలకు జీతం రూ.20వేలకు పైగానే

విజయనగరం అర్బన్‌: నిరుద్యోగ యువతీయువకులకు వివిధ ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. సంగీత మొబైల్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, క్యాషియర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌ (రెండు సంవత్సరాల అనుభవం) తదితర 100 పోస్టులను భర్తీ చేయనున్నారని, జీతం రూ.13,000 నుంచి రూ.21,000, ఇంటెన్సివ్‌ ఉంటుందని తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని వయసు 30 ఏళ్లలోపు, మేనేజర్‌ పోస్టులకు 33 ఏళ్ల వరకు ఉండాలని, రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ (జెనిక్స్‌)లో ప్రొడక్షన్‌లో 30, అపరేషన్‌, మెయింటనెన్స్‌లో 30 పోస్టులను భర్తీ చేస్తారని, జీతం రూ.19,477 నుంచి 20,535 మధ్య ఉంటుందని తుని సమీపంలోని కేశవరంలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

Job Fair for Freshers: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్‌సీ, ఎంపీసీ, సీబీజెడ్‌, డిప్లమో ఇన్‌ కెమికల్‌, మెకానికల్‌, బీటెక్‌ మెకానిక్‌లో ఉత్తీర్ణులై ఉండాలని వయసు 27 సంవత్సరాలు మించకూడదని, 2017–2024 మధ్య ఉత్తీర్ణులై ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌లో హోం సేల్స్‌ ఆఫీసర్‌ 15 పోస్టులను భర్తీ చేయనున్నారని, జీతం రూ.15,000, కనీసం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండి, వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలని, విజయనగరం జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని పురుష అభ్యర్ధులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామీణ లిమిటెడ్‌లో ట్రైనీ కేంద్ర మేనేజర్‌ (ఫీల్డ్‌వర్కు)–130 పోస్టుల భర్తీ జరుగుతుందని జీతం రూ.13 వేలు, పెట్రోల్‌ చార్జ్‌, ఇన్సెంటివ్‌, వసతి సదుపాయం కల్పించనున్నారని, ద్విచక్ర వాహనం కలిగి ఉండాలని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

ITI counselling: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా వారి పేర్లను ఎంప్లాయిమెంట్‌.ఎపీ.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ఈ నెల 9న విజయనగరంలోని గంటస్తంభం సమీపంలో గల ఎంఆర్‌కళాశాలలో ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకుని రావాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 8919179415 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

#Tags