Free Self Employment Courses: 30న ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు.. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ స్త్రీ, పురుషులు అర్హులని పేర్కొన్నా రు. పురుషులకు కంప్యూటర్ డీటీపీ (45 రోజులు), ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ (30 రోజులు), ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ (30 రోజులు), కారు డ్రైవింగ్ (ఎల్‌ఎల్‌ఆర్ కలిగి ఉండాలి, 30 రోజులు), అలాగే స్త్రీలకు బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ (30 రోజులు), హోమ్ నర్సింగ్ (30 రోజుల పాటు)లలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.
చదవండి: REC Limited Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 74 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో పాల్గొనాలని సూచించారు. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించ నున్నామని తెలిపారు. వివరాలకు 90147 16255, 9491741129 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |