Government Job Offer : శుభవార్త.. సర్కార్ కొలువుల కోసం మంచి చాన్స్.. ఈ విద్యార్హత ఉంటే చాలు!!
సాక్షి ఎడ్యుకేషన్: ఎందరో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకుంటూనే వారు పూర్తి చేసిన విద్యకు సంబంధించిన ఉద్యోగం చేస్తుంటారు.
Mega Job Mela For Freshers: మెగా జాబ్‌మేళా.. 2000 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ పూర్తి వివరాలివే!
కొందరు అదే పనిగా ప్రభుత్వ పరీక్షల కోసమే సిద్ధమవుతుంటారు. అయితే, వారందరి కోసమే ఈ ఆర్ఈసీ... అంటే, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రస్తుతం, ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి.. అనేక మంది సర్కార్ కొలువు సాధించాలనే కలలను ఇది నెరవేర్చగలదు. వివరాల్లోకి వెళితే..
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) కేంద్ర ప్రభుత్వ సంస్థ బాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసి, అభ్యర్థులు బంగారు భవిష్యత్తుకు దారి చూపింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
Indian Railways : 1036 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే..!!
అయితే, దీనిలో పలు విభాగాల్లో 74 మేనేజర్ పోస్టులు, ఆఫీసర్ వంటి వివిధ ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీ కొరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో ఇంజినీరింగ్, హెచ్‌ఆర్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ, కంపెనీ సెక్రెటేరియట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్, లా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రాజ్‌బాష తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
10 Lakh Jobs: యువతకు దాదాపు 10 లక్షల శాశ్వత ఉద్యోగాలు: ప్రధాని మోదీ
దరఖాస్తులకు చివరి తేదీ: అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల అంటే, డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఎంపికా విధానం: రాత పరీక్ష, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.
పోస్టుల ఖాళీలు: మొత్తం ఖాళీగా ఉన్న 74 పోస్టుల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ 08, జనరల్ మేనేజర్ 03, చీఫ్ మేనేజర్ 04, మేనేజర్ 05, అసిస్టెంట్ మేనేజర్ 09, ఆఫీసర్ 36, డిప్యూటీ మేనేజర్ 09 పోస్టులు ఉన్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అర్హులు: పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్/ ఎల్‌ఎల్‌బీ, సీఏ/ సీఎంఏ/ ఎంఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీ/ పీజీ డిప్లొమా పాస్ కావడంతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొన్నారు.
ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://recindia.nic.in/ చూడండి.