JEE Mains Result 2024: 25న ‘జేఈఈ’ ఫలితాలు.. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు ఇన్ని లక్షల మందికి అర్హత కల్పిస్తారు

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన JEE Main–2 ఫలితాలు ఏప్రిల్ 25న వెల్లడించబోతున్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరిలో మొదటి విడత మెయిన్, రెండో విడత మెయిన్‌ ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకూ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది వరకూ ఈ పరీక్షకు హాజర­య్యారు.

చదవండి: Free Training for JEE, NEET & EAPCET: ఉచిత శిక్షణ.. భవితకు రక్షణ

మొదటి విడత మెయిన్‌కు ర్యాంకులు ఇవ్వరు. ఇందులో అర్హులైన వారు కూడా మంచి ర్యాంకుకు రెండో విడత పరీక్ష రాశారు. దీంతో జాతీయస్థాయి ర్యాంకులను ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత కల్పిస్తారు.   

#Tags