JEE Advanced Result 2024 Date and Time : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..! జోసా కౌన్సెలింగ్ ఎప్ప‌టి నుంచి అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌రుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ప‌రీక్ష మే 26వ తేదీన ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రెస్పాన్స్‌ షీట్లు విడుదలయ్యాయి. జూన్‌ 9వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు 2024 విడుదల కానున్నాయి. అలాగే ఫ‌లితాల విడుద‌ల రోజే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫైనల్ కీ కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫైనల్‌ కీ, ఫలితాలను https://jeeadv.ac.in/వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది JEE Advanced 2024 పరీక్ష రాసి ఉంటారని అంచనా.

☛ ECE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'ECE' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా వ‌చ్చే.. లాభాలు ఇవే..!

జోసా కౌన్సెలింగ్‌..
జూన్‌ 10వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు.

☛ CSE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

#Tags