JEE Advanced 2024 Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే చివరి తేదీ.. అప్లై చేశారా?

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2024 రిజిస్ట్రేషన్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రేపటితో(మే7)న దరఖాస్తుల గడువు ముగియనుంది.ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహించనుంది.

జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్య‌ర్థులు జేఈఈ అధికారిక సైట్ jeeadv.ac.in నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

CISEC Results 2024 : ఐసీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల​.. ఇలా చెక్‌ చేసుకోండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌..
ప్రకటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష మే 26న ఉంటుంది. ఇందులో రెండు పేప‌ర్లు ఉంటాయి.పేప‌ర్ 1 ప‌రీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.

పేప‌ర్ 2 ప‌రీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్షలు నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్  పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

#Tags