JEE Advanced 2024 Rankers: ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశానికి నిర్వ‌హించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాల్లో జిల్లా విద్యార్థుల ప్ర‌తిభ‌.. ఆలిండియా స్థాయిలో ర్యాంకులు..!

ఐటీఐ క‌ళాశాల‌ల్లో ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశానికి నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు సంబంధించి ఫ‌లితాలు ఆదివారం విడుదలైయ్యాయి. ఈ నేప‌థ్యంలో జిల్లాలోని విద్యార్థులు దేశ‌స్థాయిలో సాధించిన ర్యాంకులను వివ‌రించారు..

అనంతపురం: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కళాశాలల్లోని ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2024 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఉదయం ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో బీటెక్‌, బ్యాచిలర్‌ అఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. జాయింట్‌ సీట్‌ అలికేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లను భర్తీ చేయనుంది.

TSPSC Group 4 Certificate Verification Documents : గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల.. సర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు కావాల్సిన ప‌త్రాలు ఇవే..

బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతు పాలగిరి లక్ష్మీరెడ్డి కుమారుడు పాలగిరి సతీష్‌రెడ్డి 360 మార్కులకు 285 మార్కులు సాధించి దేశస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 175 ర్యాంకులో నిలిచాడు. దీంతో సతీష్‌రెడ్డిని పలువురు అభినందించారు. తమ కుమారుడు ఈస్థాయి ర్యాంకు సాధించడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు, బంధువులు పేర్కొన్నారు. అలాగే జి. శశికిరణ్‌ 234 మార్కులు సాధించి ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 982 ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లోనూ ఓపెన్‌ క్యాటగిరీలో 1,830, తెలంగాణ ఎంసెట్‌లో 437 ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల్లో అనంతపురం నగరానికి చెందిన షేక్‌ ముజమ్మిల్‌ ప్రతిభ చాటాడు.

TS EdCET 2024 Results: రేపు ఎడ్‌సెట్ ఫ‌లితాల విడుద‌ల‌... మార్కుల కోసం క్లిక్ చేయండి

ఆలిండియా జనరల్‌ కేటగిరీలో 823వ ర్యాంకు సాధించాడు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు డి.నజత్‌కౌషర్‌, కలీముల్లా ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరితో పాటు సి. మేఘన 4,124 ర్యాంకు, జి. మోహన్‌ప్రదీప్‌ 4,657 ర్యాంకు, అజయ్‌ కృష్ణారెడ్డి 5,287, సిద్ధార్థరెడ్డి 16,145, అసిమ్‌ఖాన్‌ 17,929 అఖిల భారత ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరీల్లో జి. దీపిక 2,241 ర్యాంకు, డి. స్తుతి ప్రశంసిని 3,713, పి. రేణుక 4,658 ర్యాంకులు సాధించి అర్హత సాధించారు.

JEE Advanced Results 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

ఎంఈఓ కుమారుడికి..

శింగనమల ఎంఈఓ శివప్రసాద్‌ కుమారుడు జి.సాయిగౌతమ్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో రాణించాడు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 204 ర్యాంకు సాధించాడు. విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సాయిగౌతమ్‌కు అభినందనలు తెలిపారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తాడిపత్రికి చెందిన కె.సాయి హనీష్‌రెడ్డి, ఎస్‌.చక్రదర్‌రెడ్డి ఆల్‌ఇండియా స్థాయిలో ర్యాంకులు కై వసం చేసుకుని ప్రతిభను కనబరిచారు. కె.సాయి హనీష్‌రెడ్డి 278 మార్కులతో ఆల్‌ఇండియా స్థాయిలో 233వ ర్యాంకు సాధించాడు. అలాగే ఎస్‌.చక్రధర్‌రెడ్డి 206 మార్కులతో 2059 ర్యాంకును సాధించాడు. దీంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు అభినందించారు.

Free Training Program: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ఐటీలో ఉచితంగా శిక్షణ

#Tags