JEE Student Felicitation : జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్ర‌తిభ చూపిన విద్యార్దికి స‌న్మానం..

వాంకిడి: వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ప్రతిభ చూపిన మండల కేంద్రానికి చెందిన దుర్గం అర్జున్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి గురువారం ఆసిఫాబాద్‌లో శాలువాతో సన్మానించి అభినందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1782వ ర్యాంకు సాధించి తిరుపతి ఐఐటీలో సీటు సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ కు రూ.35 వేల ఆర్థికసాయం అందించారు. చదువు పూర్తయ్యే వరకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత చదువు పూర్తి చేసి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సంపత్‌కుమార్‌, అధ్యాపకులు చంద్రయ్య, కిరణ్‌, రాజమౌళి, సంతోష్‌, అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Government Schools Admissions : 'బ‌డిబాట' కార్య‌క్ర‌మంతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు స‌ర్కారు బ‌డులపై అవ‌గాహ‌న..!

#Tags