After 10th Class and Inter Based Jobs 2024 : టెన్త్, ఇంటర్ అర్హతతోనే.. వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..
కానీ ఇవి తెలియక చాలా మంది టెన్త్, ఇంటర్‌కు ఏమి ఉద్యోగాలు వస్తాయి అనే భ్రమలో ఉంటారు. పది పాసైన వాళ్లు రైల్వేల్లో టికెట్ కలెక్టర్, ఏపీఎస్‌ఆర్‌టీసీలో బస్ కండక్టర్, సేవాదళాల్లో కానిస్టేబుల్ లాంటి పోస్టులెన్నో సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ అర్హతతో వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య ఎక్కువే. ఎన్‌డీఏ, ఎస్‌సీఆర్‌ఏలతో పాటు డిఫెన్స్‌లోని టెక్నికల్ ట్రేడ్ ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్..ఇలా చాలా విభాగాల్లో కొలువులున్నాయి.
టెన్త్, ఇంటర్ అర్హతతోనే.. బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవే..
పదోతరగతి అర్హతతో బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్..
రైల్వే జాబ్స్ :
పోస్టులు: కమర్షియల్ క్లర్క్, టికెట్ ఎగ్జామినర్ (టికెట్ కలక్టర్), ట్రై న్స్ క్లర్క్
ఎంపిక విధానం: రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
వేతన శ్రేణి: రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.2000
పోస్టులు: అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైప్ పరీక్ష ద్వారా
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు.
వేతన శ్రేణి: రూ.5,200- రూ.20,200
పోస్టు: ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5,200 నుంచి రూ.20,200
వెబ్‌సైట్: www.rrcb.gov.in
డిఫెన్స్ జాబ్స్ :
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ :
పోస్టు: ఎయిర్‌మెన్ గ్రూప్-వై మ్యుజీషియన్ ట్రేడ్
అర్హత: పదోతరగతిలో 45 శాతం మార్కులు. వయస్సు 16న్నర ఏళ్ల నుంచి 19న్నర ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా. సంబంధిత సంగీత పరికరంలో ప్రావీణ్యం ఉండాలి.
వేతన శ్రేణి: రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.2000
వెబ్‌సైట్: https://careerairforce.nic.in
ఇండియన్ నేవీ :
పోస్ట్: మెట్రిక్ రిక్రూట్ -స్టివార్డ్/కుక్స్; మ్యుజీషియన్లు
వయోపరిమితి: 17-21 ఏళ్లు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
ఇండియన్ ఆర్మీ :
పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ
అర్హత: పదోతరగతిలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.
వయోపరిమితి: 17న్నర నుంచి 21 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
ఏపీఎస్‌ఆర్‌టీసీ :
పోస్టు: బస్ కండక్టర్
ఎంపిక విధానం: పదోతరగతి మార్కులతో
పోస్టు: బస్ డ్రైవర్
ఇతర అర్హతలు: హెవీ మోటార్ వెహికల్ పెర్మనెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు నిర్దేశిత అనుభవం తప్పనిసరి
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ -సీఐఎస్‌ఎఫ్ :
పోస్టు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: వివిధ దేహదారుఢ్య, రాతపరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://www.cisf.gov.in
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) :
పోస్టు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://crpf.nic.in
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) :
పోస్టు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://bsf.nic.in
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) :
పోస్టు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు:హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) :
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ. 2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు: కానిస్టేబుల్ (లైన్‌మెన్) :
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్‌పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు: హెడ్‌కానిస్టేబుల్ (రేడియో టెక్నీషియన్) :
వయోపరిమితి: 20-25 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు: కానిస్టేబుల్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) :
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్ డ్రై వింగ్ లెసైన్స్ పొందాలి. భారీ మోటార్ వాహనం నడపడంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 20-25 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు: కానిస్టేబుల్ (పయనీర్) :
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు కనీసం ఏడాది సంబంధిత విభాగం (కట్టడం, కూల్చడం)లో అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-23 ఏళ్లు
వేతన శ్రేణి: రూ.5200-20200 +గ్రేడ్ పే రూ.2000
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పైన తెలిపిన అన్ని ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు www.itbpolice.nic.in లో చూడొచ్చు.
మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) :
పోస్టు: గ్రూప్-సీలో ఎల్‌డీసీ, స్టెనో గ్రేడ్-3
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-27 ఏళ్లు
స్కిల్స్: ఎల్‌డీసీ పోస్టులకు నిమిషానికి 30 ఇంగ్లిష్, 25 హిందీ పదాలు టైప్ చేయాలి. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. స్టెనో గ్రేడ్-3 పోస్టులకు స్టెనోగ్రఫీ/షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 ఇంగ్లిష్/హిందీ పదాలు రాయాలి. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరి.
వెబ్‌సైట్: https://mes.gov.in
ఇంటర్ అర్హతతోనే బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవే..
ఇండియన్ ఆర్మీ :
పోస్ట్: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
ఎంపికైతే: టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లు పూర్తి ఉచితంగా చదివే అవకాశం. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ఆరంభం.
ప్రకటన: ఏటా ఏప్రిల్, సెప్టెంబర్‌ల్లో
వయోపరిమితి: 16 1/2-19 ఏళ్లు
విద్యార్హత: 70 శాతం మార్కులతో ఎంపీసీ
ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా
శిక్షణ: ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఏడాది శిక్షణ డెహ్రాడూన్‌లో నిర్వహిస్తారు. తర్వాత నాలుగేళ్లు మిలటరీ ఇంజనీరింగ్ కాలేజ్-పుణె, మిలటరీ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాలేజ్-మావ్, మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్-సికింద్రాబాద్‌ల్లో శిక్షణ పొందుతారు.
పోస్టు: సోల్జర్ టెక్నికల్ :
అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు:క్లర్క్, స్టోర్ కీపర్
అర్హత: ఇంటర్మీడియట్ ఏదైనా గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు రావాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
పోస్టు:నర్సింగ్ అసిస్టెంట్ :
అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులోనూ తప్పనిసరిగా 40 శాతం మార్కులు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్ప నిసరి. వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
ఇండియన్ నేవీ :
పరీక్ష: 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 75 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు రావాలి.
వయోపరిమితి: 17-19 1/2 ఏళ్లు
ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
ఎంపికైతే: ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవల్ అకాడెమీ ఎజిమాల-కేరళలో నాలుగేళ్లు బీటెక్ అభ్యసిస్తారు. ఖాళీలు, అభిరుచి బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్/ నేవల్ ఆర్కిటెక్ట్/మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో ఎందులోనైనా శిక్షణ కొనసాగుతుంది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ. యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది.
పోస్ట్: సైలర్ ఆర్టిఫిషర్ అప్రెంటిస్
అర్హత: ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వేతన శ్రేణి: రూ.. 5200-20200+ గ్రేడ్ పే రూ..2000+ఎంఎస్‌పీ రూ.. 2000+ ఎక్స్ గ్రూ.ప్ పే రూ..1400. నెలకు రూ.. 17000 వరకు వేతనం అందుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
పోస్ట్: సీనియర్ సెకెండరీ రిక్రూటర్స్
అర్హత: ఎంపీసీతో ఇంటర్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య, ఆరోగ్య పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
కోర్సు: ఎంబీబీఎస్
ప్రత్యేకతలు: ఎంపికైన అభ్యర్థులు ఒక్క పైసా ఫీజు చెల్లించకుండా, ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణెలో ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు చెందిన ఆసుపత్రుల్లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇదే కళాశాలలో వివిధ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులను అభ్యసించొచ్చు.
మొత్తం సీట్లు: 130. వీటిలో 25 సీట్లు అమ్మాయిలకు కేటాయించారు.
అర్హత: ఇంటర్ బైపీసీ గ్రూప్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు పొందాలి.
వయోపరిమితి: 17-22 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ప్రకటన: ప్రతి ఏటా జనవరిలో
వెబ్‌సైట్: https://armedforces.nic.in
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ :
పోస్ట్:గ్రూప్-ఎక్స్ ఉద్యోగాలు (టెక్నికల్ ట్రేడ్స్)
అర్హత: ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత
వయోపరిమితి: 17-22 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వేతన శ్రేణి: రూ.5500-20200+ గ్రేడ్ పే రూ.2000
పోస్ట్: గ్రూప్-వై
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్
వయోపరిమితి: 17-25 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, ఆరోగ్య పరీక్షల ద్వారా
వేతన శ్రేణి: రూ.5500-20200+ గ్రేడ్ పే రూ.2000
వెబ్‌సైట్: https://indianairforce.nic.in
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) :
పరీక్ష: కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (10+2)
పోస్టులు: ఎల్‌డీసీ, స్టెనో డీ, స్టెనో సీ, డేటా ఎంట్రీ
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఎల్‌డీసీ పోస్టులకు నిమిషానికి 25 ఇంగ్లిష్, 30 హిందీ పదాలు టైప్ చేయాలి. స్టెనో డీ కోసం షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు రాయాలి. స్టెనో సీ పోస్టులకు నిమిషానికి 100 ఇంగ్లిష్ పదాలు షార్ట్‌హ్యాండ్‌లో రాయాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్లు
వేతన శ్రేణి: ఎల్‌డీసీ రూ.3050-4500, స్టెనో డీ, రూ.4000-6000, స్టెనో సీ రూ.5500-9000
ఎంపిక: రాతపరీక్ష, టెక్నికల్ పరీక్షల ద్వారా
ప్రకటన: ప్రతిఏటా
వెబ్‌సైట్: https://ssccr.org
ఏపీపీఎస్‌సీ :
ఉద్యోగం:గ్రూప్-4
పోస్ట్: జూనియర్ అసిస్టెంట్స్
వయోపరిమితి: 18-36 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
వెబ్‌సైట్: www.apspsc.gov.in
ఏపీ పోలీస్ :
పోస్ట్: పోలీస్ కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్ విభాగాలు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-23 ఏళ్లు
ఎంపిక: దేహదారుఢ్య, రాత పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://apstatepolice.org
టీఎస్‌పీఎస్సీ :
ఉద్యోగం:గ్రూప్-4
పోస్ట్: జూనియర్ అసిస్టెంట్స్
వయోపరిమితి: 18-36 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
టీఎస్ పోలీసు :
పోస్ట్: పోలీస్ కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్ విభాగాలు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-23 ఏళ్లు
ఎంపిక: దేహదారుఢ్య, రాత పరీక్షల ద్వారా
వెబ్‌సైట్: https://www.tslprb.in/
పైన తెలిపిన పోస్టుల్లో జీతాల విషయంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.