Job Mela For Freshers: రేపు జాబ్‌మేళా.. ఈ సర్టిపికేట్స్ తప్పనిసరి
Sakshi Education
చీపురుపల్లి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఈనెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.కృష్ణాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి బహుళజాతి కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Job Mela For Freshers
టెన్త్, ఇంటర్మీడియట్, ఎంఫార్మసీ, బీఫార్మసీ, డీఫార్మసీ, డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించిన 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈజాబ్‌మేళాకు అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు ఒరిజినల్, జెరాక్స్, పాస్‌ఫోటోతో హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 81069 23623, 99888 53335 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.