TS Inter Supplementary Exams Paper Valuation postponed 2024 : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ వాల్యుయోషన్ వాయిదా.. కారణం ఇదే..?
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. నూతన షెడ్యుల్ ప్రకారం తొలి విడత జూన్ 5 నుంచి, రెండో విడత జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఇంటర్‌బోర్డు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తదితర కారణాలతో వాయిదా వేశారు. అయితే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం వాయిదా వేయడంతో.. ఫలితాల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ 2024-25 ఇదే..
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అకడమిక్ యాన్యువల్ క్యాలెండర్‌ను మార్చి 30వ తేదీన విడుదల చేసింది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్ విద్యా సంవత్సరం 2024 జూన్ 1వ తేదీ ప్రారంభమై.. 2025 మార్చి 29వ ముగియనుంది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం పని దినాలు 227గా ఉండనున్నాయని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది కూడా కాలేజీలకు సెలవులు భారీగానే ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు..
ఇంటర్ అర్ధవార్షిక పరీక్షలు నవంబర్ 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు 2025 జనవరి 20 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మాత్రం మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉండనున్నాయి. అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 11 నుంచి 16 వరకు ఉండనున్నాయి. అలాగే వివిధ పండగ సెలవులు తేదీలను బట్టి ఇవ్వనున్నారు. అలాగే 2025 వేసవి సెలవులు మాత్రం మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.