TS Inter Colleges Admissions 2024-25 : ఇంటర్ విద్యార్థుల‌కు బోర్డు కీలక హెచ్చ‌రిక‌.. ఈ కాలేజీల్లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇంట‌ర్ కాలేజీల్లో జాయిన్ అవుతున్న విద్యార్థుల‌కు.. ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంట‌ర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ముఖ్యంగా ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమతులు లేని కాలేజీల్లో చేరితే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఇంట‌ర్ బోర్డ్ తెలిపింది. ఎగ్జామ్ ఫీజు చెల్లించే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించింది. 

ఈ వెబ్‌సైట్ ద్వారా..
ఏఏ కాలేజీలకు అనుమతులు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు కాలేజీల జాబితాను https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ వెబ్‌సైట్ ద్వారా అనుమ‌తి ఉన్న ఇంట‌ర్‌ కాలేజీల లిస్ట్‌ చెక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏమైనా సందేహాలు ఉంటే ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించవచ్చు.

ఈ ఏడాది ఇంట‌ర్‌ అకడమిక్ క్యాలెడర్ 2024-25 ఇదే..
తెలంగాణ ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్‌ ప్రకటించింది. జూన్ 1న కాలేజీలు కూడా పునఃప్రారంభం అయ్యాయి. ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 14, 2024న కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటనలో తెలిపింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి త‌ర్వాత‌ జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

 ఇంట‌ర్‌ ఏడాది ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే 2024-25 :
☛ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ➤ ఫిబ్రవరి మెదటి వారం, 2025
☛ ఇంటర్ వార్షిక పరీక్షలు ➤ మార్చి మొదటి వారం, 2025
☛ 2024-25 అకాడమిక్ క్యాలెండర్ చివరి పనిదినం ➤ మార్చి 29, 2025
☛ వేసవి సెలవులు- మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు
☛ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ➤ మే చివరి వారం, 2025
☛ 2025-26 విద్యాసంవత్సంలో ఇంటర్ కాలేజీల రీఓపెన్ ➤ జూన్ 2, 2025
☛ ఈ విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజుల పాటు ఇంటర్ కాలేజీలు పనిచేయనున్నాయి. 75 రోజుల పాటు సెలవులు రానున్నాయి. 
☛ ఈ ఏడాది మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీడేస్‌ని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

#Tags