APPSC Group 1 Ranker : గ్రూప్-1, 2 రెండు ఉద్యోగాలు కొట్టానిలా..
ఈమె భవాని ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో డిప్యూటి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. అంతకు మునుపు గ్రూప్–2లో ఎంపికై వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో కూడా పని చేశారు.
☛ APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భయటపడ్డానిలా.. ఎన్నో వివక్షతలు ఎదుర్కొంటూనే గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
కుటుంబ నేపథ్యం :
భవాని భర్త విశ్వనాథ్ వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పాదన సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. తల్లి కె.తులసి గృహిణి కాగా తండ్రి చెన్నకృష్ణ కదిరిలో ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. తమ కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడం పట్ల ఆమె తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు. ఆమెను స్వగ్రామానికి చెందిన వారు అభినందించారు.
ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన భూమి రెడ్డి భవానీ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకుతో మెరిశారు. జేఎన్‌టీయూ అనంతపురంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన కే. ప్రవీణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు దక్కించుకుని పలువురితో శభాష్ అనిపించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని గ్రామీణాభివృద్ధి విభాగంలో పరిశోధన చేస్తున్న దానం జ్ఞానానంద రెడ్డి గ్రూప్–1లో ర్యాంకు సాధించి అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ (గతంలో సీటీఓ) ఉద్యోగం దక్కించుకున్నారు. అలాగే బెళుగుప్ప ఎంపీడీఓ గాజుల శ్రీరాములు రామచంద్ర, లక్ష్మి కుమారుడు గాజుల రామచంద్రవరుణ్ గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటి ఎంపీడీఓగా ఎంపికయ్యారు.