బంధుత్వం - మతం - తెగలు - తెలంగాణ సమాజ సాంస్కృతిక లక్షణాలు
1. కింద పేర్కొన్న వారిలో ఒక వ్యక్తికి ప్రాథమిక బంధువు కానివారు?
ఎ) తల్లి
బి) తండ్రి
సి) మామ
డి) తమ్ముడు/అన్న
- View Answer
- సమాధానం: సి
2. ‘కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా’ పుస్తక రచయిత ఎవరు?
ఎ) డి.ఎన్. మజుందార్
బి) ఐరావతి కార్వే
సి) టి.ఎన్. మదాన్
డి) ఎ. రాస్
- View Answer
- సమాధానం: బి
3. గోత్రం, వంశాల్లో సభ్యత్వం ఎలా వస్తుంది?
ఎ) వంశానుక్రమం ద్వారా
బి) బంధుత్వం ద్వారా
సి) ఆస్తి ద్వారా
డి) వివాహం ద్వారా
- View Answer
- సమాధానం: ఎ
4. కొన్ని కులాలు కలిసి ఏర్పడేది?
ఎ) గోత్ర కూటమి
బి) గోత్ర సమితి (Clan Council)
సి) ద్విశాఖ (Moiety)
డి) వంశం (Lineage)
- View Answer
- సమాధానం: ఎ
5. బంధుత్వం అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించిన వారు?
ఎ) సర్ హెన్రీ మెయిన్
బి) మెకైవర్ ఒపేజ్
సి) జి.పి. మర్దాక్
డి) రాల్ఫ్ లింటన్
- View Answer
- సమాధానం: ఎ
6. గోత్ర సభ్యుల మధ్య అంతర్వివాహాన్ని అంగీకరించే తెగ?
ఎ) కిప్సిజీ
బి) గుస్సి
సి) కాడారా
డి) ఖాసీ
- View Answer
- సమాధానం: ఎ
7. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏది?
ఎ) పేరిణీ నృత్యం
బి) గుసాడి
సి) గరగ నృత్యం
డి) దింసా
- View Answer
- సమాధానం: ఎ
8. ‘మతం ప్రజలకు ఒక మత్తు లాంటిది’ అని పేర్కొన్నవారు?
ఎ) కార్ల్ మార్క్స్
బి) ఎం.ఎన్.శ్రీనివాస్
సి) హట్టన్
డి) వెబర్
- View Answer
- సమాధానం: ఎ
9. హిందూ మతం ప్రకారం కింది వాటిలో పురుషార్థాలు ఏవి?
ఎ) ధర్మం
బి) అర్థం, కామం
సి) మోక్షం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
10. హిందూ మతం ప్రకారం నాలుగు దశల ద్వారా ప్రయాణించి మోక్షం సాధించాలి. ఈ నాలుగు దశల సరైన క్రమం?
1. బ్రహ్మచర్యాశ్రమం
2. గృహస్థాశ్రమం
3. వానప్రస్థాశ్రమం
4. సన్యాసాశ్రమం
ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 3, 2, 4, 1
డి) 1, 2, 4, 3
- View Answer
- సమాధానం: ఎ
11. ఏకేశ్వర వాదన, సమానత్వం, సోదరత్వం అనేవి కింది ఏ మతానికి మూలాధారాలు?
ఎ) ఇస్లాం
బి) బౌద్ధం
సి) జైనం
డి) పార్శీ
- View Answer
- సమాధానం: ఎ
12. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) క్రీస్తు అంటే ‘అభిషిక్తుడు’, ఏసు అంటే ‘రక్షకుడు’ అని అర్థం
బి) క్రైస్తవ మత పవిత్ర గ్రంథం ‘బైబిల్’
సి) ‘పది ధర్మసూత్రాలు’ అనే భావన క్రైస్తవ మతానికి చెందింది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ‘సిక్కు’ అనేది ‘శిష్య’ అనే పదం నుంచి ఆవిర్భవించింది
బి) సిక్కు మత స్థాపకుడు గురునానక్
సి) సిక్కుల పవిత్ర గ్రంథం ‘ఆది గ్రంథ్’ (శ్రీ గురుగ్రంథ్ సాహెబ్)
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
14. పార్శీలు భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వచ్చారు?
ఎ) పర్షియాన్ (ఇరాన్)
బి) ఇరాక్
సి) సౌదీ అరేబియా
డి) ఖతార్
- View Answer
- సమాధానం: ఎ
15. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ‘అష్టాంగ మార్గం’ బౌద్ధ మతానికి సంబంధించింది
బి) బౌద్ధ మత పవిత్ర గ్రంథం ‘త్రిపీటకాలు’
సి) హీనయానం, మహాయానం, వజ్రయానం అనేవి బౌద్ధ మత శాఖలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జైనమతంలో తీర్థంకర అంటే వంతెన నిర్మించేవాడు అని అర్థం. ఈ మతంలో మొత్తం తీర్థంకరుల సంఖ్య-24
బి) జైనమత పవిత్ర గ్రంథాలు ‘అంగాలు’
సి) దిగంబర, శ్వేతాంబర అనేవి జైన మతానికి చెందిన శాఖలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. కుహనా ప్రసూతి లేదా కౌవాడే పద్ధతి ఏ తెగల్లో కనిపిస్తుంది?
ఎ) ఖాసీ
బి) గోండు
సి) సంతాల్
డి) భిల్లు
- View Answer
- సమాధానం: ఎ
18. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టం?
ఎ) జార్ఖండ్
బి) మధ్యప్రదేశ్
సి) నాగాలాండ్
డి) కేరళ
- View Answer
- సమాధానం: బి
19. భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది?
ఎ) గోండులు
బి) భిల్లులు
సి) ఓరాన్లు
డి) లెప్చాలు
- View Answer
- సమాధానం: బి
20. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) వెన్నెలకంటి రాఘవయ్యను ‘గిరిజన గాంధీ’గా పిలుస్తారు
బి) 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరాంలో ఎస్టీ జనాభా 94.5 శాతం
సి) 338(ఎ) అధికరణను 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
21. కిందివాటిలో సరికాని జత?
ఎ) ఖాసీ, గారో, జయంతియా తెగలు- మేఘాలయ
బి) తోడాలు, బడగాలు, కోట తెగలు - తమిళనాడు
సి) ఓంజి, సెంటనిలీస్ తెగలు - అండమాన్, నికోబార్ దీవులు
డి) చెంచులు- జమ్ము-కశ్మీర్
- View Answer
- సమాధానం: డి
22. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డు తెగల జనాభా శాతం?
ఎ) 7.34
బి) 8.34
సి) 9.34
డి) 10.34
- View Answer
- సమాధానం: సి
23. తెలంగాణలో చెంచులు ఎక్కువగా ఉన్న జిల్లా?
ఎ) మహబూబ్నగర్
బి) వరంగల్
సి) ఆదిలాబాద్
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: ఎ
24. కింది వాటిలో మహిళల రక్షణ కోసం భారత ప్రభుత్వం చేసిన చట్టం?
ఎ) The Hindu Marriage Act-1955
బి) The succession Act -1956
సి) The dowry prohibition Act - 1961
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25.కిందివాటిలో సరైంది ఏది?
ఎ) నేషనల్ ఉమెన్స్ కమిషన్ చట్టాన్ని 1990లో చేశారు. ఇది 1992 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది
బి) నేషనల్ ఉమెన్స్ కమిషన్ మొదటి చైర్మన్ జయంతీ పట్నాయక్
సి) ‘నేషనల్ ప్లాన్ ఫర్ ఉమెన్’ను 1988లో తీసుకొచ్చారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
26. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించి చేర్చిన అధికరణ?
ఎ) 233 (డి)
బి) 243 (డి)
సి) 243 (జి)
డి) 243 (ఐ)
- View Answer
- సమాధానం: బి
27. మహిళా సాధికారిత కోసం తీసుకోవాల్సిన చర్య?
ఎ) మహిళల్లో అక్షరాస్యత పెంచడం
బి) జీవన స్థితిగతులు మెరుగుపరచడం
సి) ఉత్పత్తి కారకాలపై భాగస్వామ్యం కల్పించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
28. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళల జనాభా శాతం?
ఎ) 48.46
బి) 51.54
సి) 47.46
డి) 50.54
- View Answer
- సమాధానం: ఎ
29.ప్రాథమిక విధుల్లో.. మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూడాలని పేర్కొన్న అధికరణ ఏది?
ఎ) 51 A(e)
బి) 51 A(f)
సి) 51 A(g)
డి) 51 A(d)
- View Answer
- సమాధానం: ఎ
30. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తెలిపే అధికరణ ఏది?
ఎ) 39 (b)
బి) 39 (c)
సి) 39 (d)
డి) 39 (e)
- View Answer
- సమాధానం: సి
31.సాధారణంగా మధ్య తరగతిని నిర్వచించడానికి తీసుకొనే ప్రాతిపదిక ఏది?
ఎ) విద్య
బి) వృత్తి
సి) ఆదాయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
32. భారతదేశంలో మధ్యతరగతి వర్గం ఆవిర్భవానికి దోహదం చేసిన అంశం?
ఎ) పారిశ్రామికీకరణ
బి) నగరీకరణ
సి) బ్రిటిష్ పరిపాలన వ్యవస్థ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. భారత్లోని మధ్యతరగతి వారిలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల జరిగిన పరిణామం?
ఎ) సాంకేతిక పరిజ్ఞానం అధికంగా వినియోగించుకోవడం
బి) అధిక వేతన ఉద్యోగాల కోసం పోటీ పెరగడం
సి) వేగవంతమైన జీవన సరళి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
34. ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్స్’ రీసెర్చ్ ప్రకారం మధ్యతరగతి అంటే?
ఎ) వార్షికాదాయం రూ. 2 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉన్నవారు
బి) వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న వారు
సి) వార్షికాదాయం 2.5 లక్షల పైన ఉన్నవారు
డి) వార్షికాదాయం రూ. 2 నుంచి 5 లక్షల మధ్య ఉన్నవారు
- View Answer
- సమాధానం: ఎ
35. తెలంగాణ రాష్ర్ట పండుగ ‘బతుకమ్మ’ను ఎన్ని రోజులు జరుపుకొంటారు?
ఎ) 9
బి) 10
సి) 11
డి) 2
- View Answer
- సమాధానం: ఎ
36. ‘గాథా సప్తశతి’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) గుణాఢ్యుడు
బి) హాలుడు
సి) బద్దెన
డి) శర్వ వర్మ
- View Answer
- సమాధానం: బి
37. జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
a. నాగోబా జాతర | i) ఆదిలాబాద్ |
b. సమ్మక్క-సారలమ్మ జాతర | ii) వరంగల్ |
c. పెద్దగట్టు జాతర | iii) నల్లగొండ |
d. ఏడుపాయల జాతర | iv) మెదక్ |
ఎ) a-i, | b-ii, | c-iii, | d-iv |
బి) a-iv, | b-iii, | c-ii, | d-i |
సి) a-ii, | b-i, | c-iv, | d-iii |
డి) a-iv, | b-ii, | c-i, | d-iii |
- View Answer
- సమాధానం: ఎ
38.కింది వాటిలో తెలంగాణ ప్రభుత్వం రాష్ర్ట పండగగా గుర్తించింది ఏది?
1. బోనాలు
2. బతుకమ్మ
3. వినాయక చవితి
ఎ) 1, 2, 3
బి) 1, 2
సి) 2, 3
డి) 1, 3
- View Answer
- సమాధానం: బి
39. జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
a. వేయిస్తంభాల గుడి | i) వరంగల్-పాలంపేట |
b. శ్రీరాజరాజేశ్వరీ దేవాలయం | ii) కరీంనగర్- వేములవాడ |
c. శ్రీరామ దేవాలయం | iii) ఖమ్మం- భద్రాచలం |
d. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | iv) నల్లగొండ - యాదాద్రి |
e. జోగులాంబ దేవాలయం | v) మహబూబ్నగర్ - అలంపూర్ |
ఎ) a-i, | b-ii, | c-iii, | d-iv, | e-v |
బి) a-v, | b-iv, | c-iii, | d-ii, | e-i |
సి) a-ii, | b-i, | c-iii, | d-v, | e-iv |
డి) a-v, | b-iv, | c-iii, | d-i, | e-ii |
- View Answer
- సమాధానం: ఎ
40. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) తెలంగాణ జనసాంద్రత 307
బి) తెలంగాణ లింగనిష్పత్తి 988
సి) తెలంగాణ విస్తీర్ణం పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
41. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) తెలంగాణలో ప్రసిద్ధ జైనక్షేత్రం కొలనుపాక
బి) చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లాలో ఉంది
సి) తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అంద్శై
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
42. తెలంగాణ రాష్ర్ట రాజముద్రను రూపొందించినవారు?
ఎ) లక్ష్మణ్ ఏలే
బి) అంద్శై
సి) గద్దర్
డి) సయ్యద్ అహ్మద్
- View Answer
- సమాధానం: ఎ
43. కింది వాటిలో సరికాని జత?
ఎ) సిరిసిల్ల - కరీంనగర్
బి) గద్వాల్ - మహబూబ్నగర్
సి) పోచంపల్లి - నల్లగొండ
డి) నిర్మల్ - ఖమ్మం
- View Answer
- సమాధానం: డి
44. జతపరచండి.
a. భిల్లులు | i) పితృస్వామికం |
b. తోడాలు | ii) మాతృస్వామికం |
c. ఖాసీలు | iii) బహు వివాహం |
d. ఒరయాన్లు | iv) బహుభర్తృత్వం |
ఎ) a-iii, | b-iv, | c-i, | d-ii |
బి) a-iii, | b-iv, | c-ii, | d-i |
సి) a-iv, | b-iii, | c-ii, | d-i |
డి) a-iv, | b-iii, | c-i, | d-ii |
- View Answer
- సమాధానం: బి
45.కిందివాటిలో సరికాని జత?
ఎ) గారో- మేఘాలయ
బి) మురియ- మధ్యప్రదేశ్
సి) చెంచు - ఆంధ్రప్రదేశ్
డి) ఖాసి- మణిపూర్
- View Answer
- సమాధానం: డి
ఎ) మేనా
బి) గోండు
సి) ఒంగె (Onge)
డి) ముండా
నోట్: 2011 ప్రకారం వీరి జనాభా 101 మంది. వీరు అండమాన్ నికోబార్ దీవిలో ఉంటారు.
- View Answer
- సమాధానం: డి
47. కింది వాటిలో ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన గ్రంథం లేని మతం ఏది?
ఎ) జుడాయిజం
బి) క్రైస్తవం
సి) హిందూ మతం
డి) ఇస్లాం
- View Answer
- సమాధానం: సి
48. కింది వాటిలో ఈశాన్య భారతదేశానికి చెందని తెగ ఏది?
ఎ) నాగా
బి) కుకీ
సి) బోడో
డి) చెంచులు
- View Answer
- సమాధానం: డి
49. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు దేనికి సంబంధించింది?
ఎ) షెడ్యూల్డు తెగలు
బి) షెడ్యూల్డు కులాలు
సి) ఇతర వెనకబడిన వర్గాలు
డి) మైనారిటీలు
- View Answer
- సమాధానం: ఎ
50. తెలంగాణలో ఉన్న శక్తి పీఠం ఏది?
ఎ) ద్రాక్షారామం
బి) శ్రీశైలం
సి) అలంపూర్
డి) పిఠాపురం
- View Answer
- సమాధానం: సి