Group-1 Books: గ్రూప్‌–1కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు పరుగులు.. ఈ పుస్తకాల కోసమే.. కానీ

సాక్షి, హైదరాబాద్‌: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మెజార్టీ అభ్యర్థులు సాధన చేసే పుస్తకాలు తెలుగు అకాడమీవే. తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ఈ పుస్తకాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.
Telugu Academy Books

తెలుగు అకాడమీ కౌంటర్‌ వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అయితే తెలుగు అకాడమీ బుక్‌ కౌంటర్‌లో పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో పుస్తకాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ పుస్త‌కాల‌కు డిమాండ్‌ ఎక్కువ.. కానీ
సబ్జెక్టు ఏదైనా తెలుగు అకాడమీ పుస్తకాలకున్న ప్రాధాన్యతే వేరు. అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, విషయ నిపుణుల విశ్లేషణలతో కూడిన ఆ పుస్తకాలు పోటీ పరీక్షల్లో విజయానికి బాటలు వేస్తాయనే భావన అభ్యర్థుల్లో ఎప్పట్నుంచో ఉంది. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇటీవల గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల కావడం.. మొదటి నోటిఫికేషన్‌లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

TSPSC & APPSC: గ్రూప్స్ ప‌రీక్ష‌ల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో..
మంచి జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ కొలువులు చేస్తున్న వారు సైతం దీర్ఘకాలిక సెలవులు పెట్టి గ్రూప్‌–1 నియామకాల కోసం సిద్ధమవుతుండటంతో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు సంబంధిత సిలబస్‌ ఉండే పుస్తకాలు సేకరించే పనిలో పడ్డారు. ఇతర పబ్లికేషన్స్‌ మాటెలా ఉన్నా తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 

ఈ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు..
ఇంటర్వ్యూలను తొలగించడంతో గ్రూప్‌–1 పరీక్ష 900 మార్కులకు పరిమితమైంది. ఇందులో ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ ఉంటుంది. ర్యాంకింగ్‌లో ఈ మార్కులకు ప్రాధాన్యత లేనప్పటికీ మెయిన్‌ పరీక్షలకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు తప్పనిసరి. ఇక జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష మార్కులు కూడా ర్యాంకింగ్‌ పరిధిలోకి రావు. ఈ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెలుగు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  ​​​​​​​

కరెంట్‌ అఫైర్స్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ పుస్తకాలు..
కీలకమైన మెయిన్‌ పరీక్షల  సబ్జెక్టు పుస్తకాలు, కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్‌ పరీక్షల్లో మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 24 అంశాలతో కూడిన సిలబస్‌ ఉంది. అయితే కరెంట్‌ అఫైర్స్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ పుస్తకాలు అందుబాటులో లేవు.  చరిత్ర, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఇంగ్లిష్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హిస్టరీ, హెరిటేజ్, కల్చర్‌ ఆఫ్‌ తెలంగాణ పుస్తకాలు లేవు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొత్త వెర్షన్‌ కూడా లేదు.

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

ఇతర పబ్లికేషన్ల వైపు పరుగులు.. కానీ
అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఆంగ్లంలోనే ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు సమయం అత్యంత కీలకంగా మారింది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఔపోసన పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు అకాడమీలో లేని పుస్తకాల కోసం ఇతర పబ్లికేషన్ల వైపు పరుగులు పెడుతున్నారు.

నో స్టాక్‌..
పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉత్తమమని మా ప్రొఫెసర్‌ చెప్పడంతో వాటినే చదువుతున్నాను. ప్రస్తుతం గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. తాజా సమాచారంతో కూడిన పుస్తకాల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నా. కానీ కొత్త పుస్తకాల స్టాకు ఇంకా రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. వారి దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాల సెట్‌ ఒక్కో దానికి రూ.1,150 వసూలు చేస్తున్నారు.  
– డి. నర్సింగ్‌రావు, గ్రూప్‌–1 అభ్యర్థి, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

సబ్జెక్ట్‌ సమయం (గంటలు) గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ) 2 1/2 150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష) 3 150

మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్‌–2 హిస్టరీకల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      
  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3 150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  
  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3 150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     
  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3 150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 
  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3 150

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

#Tags