TSPSC Group 4 Total Applications : గ్రూప్‌-4 కు 9,51,321 దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించే.. గ్రూప్‌–4 ఉద్యోగాల‌ దరఖాస్తు గ‌డువు ముగిసింది. 8,180 గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
TSPSC Group 4 Applications

ఇందులో భాగంగా డిసెంబర్‌ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. మొత్తం 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి. ఈ గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌ను జులై 1వ తేదీన‌ రెండు పేపర్లగా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్‌–4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించ‌నున్నారు. గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌ ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్ –ఉర్దూలలో ఉంటాయి. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

TSPSC గ్రూప్‌–4 రాత ప‌రీక్షావిధానం ఇలా..

 

సెషన్‌

సమయం

పేపర్‌/సబ్జెక్ట్‌

సమయం

ప్రశ్నలు

మార్కులు

ఉదయం

10.00–12.30

పేపర్‌–1/జనరల్‌ స్టడీస్‌

2.30గం.

150

150

మధ్యాహ్నం

2.30–5.00

పేపర్‌–2/సెక్రటేరియల్‌ ఎబిలిటీ

2.30గం.

150

150

#Tags