TSPSC: గ్రూప్‌–4 దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: Telangana State Public Service Commission (TSPSC) గ్రూప్‌–4 ఆశా వహులకు శుభవార్త. దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి జనవరి 30న ఒక ప్రకటనలో వెల్లడించారు.
గ్రూప్‌–4 దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

గత డిసెంబర్‌ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్‌–4 కేటగిరీలో మరి కొన్ని కొలువులు జతచేస్తూ అనుబంధ ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

చదవండి:  టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

గ్రూప్‌–4 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 29న 49 వేలు, 30న 34,247 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. 

చదవండి:  TSPSC Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ కీల‌క ప‌రీక్ష‌ల తేదీలు ప్ర‌క‌ట‌న‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

#Tags