Group 3 Results : గ్రూప్‌-3 అభ్య‌ర్థుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. ఈ తేదీల్లోనే ఫ‌లితాలు!!

తెలంగాణ‌లో అభ్య‌ర్థులు రాసిన గ్రూప్‌-3 ప‌రీక్ష‌కు సంబంధించిన ఆన్స‌ర్ కీ, ఫ‌లితాల కోసం ఎంద‌రో అభ్య‌ర్థులు అనేక రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, వారికి ఇది బిగ్ అల‌ర్ట్ అనే చెప్పాలి. ఎంద‌కంటే, త్వ‌ర‌లోనే ఈ ఫ‌లితాలు, ఆన్స‌ర్ కీ రెండూ విడుద‌ల కానున్నాయి.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలోని గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ప్ర‌క‌టించింది టీజీపీఎస్సీ. త్వ‌ర‌లో గ్రూప్‌-3 ప‌రీక్ష‌కు సంబంధించి, ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది టీజీపీఎస్సీ. గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీ కోసం కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ను టీజీపీఎస్సీ 2024ని నవంబర్ 17,18న విజయవంతంగా నిర్వహించారు.

TGPSC Group 2 Results : మార్చి 2025లో టీజీపీఎస్సీ గ్రూప్‌-2 ఫ‌లితాలు.. ఈ త‌ర‌హాలో!

ఇప్పుడు ఆ ప‌రీక్ష‌కు సంబంధించి, కటాఫ్ మార్కులతో కూడిన జాబితాను ఈ నెల‌ డిసెంబర్ చివరి వారంలో విడుద‌ల‌ చేసేందుకు టీజీపీఎస్సీ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ వివ‌రాల‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌.. www.tspsc.gov.inలో అందుబాటులో ఉంటుంది.

ఆన్స్‌ర్ కీ.. పరీక్ష‌ ఫ‌లితాలు..

గ్రూప్‌-3 ప‌రీక్ష‌కు సంబంధించి ఆన్సర్ కీని ప్ర‌క‌టించిన తేదీకి విడుద‌ల చేసిన‌ప్పుడు అభ్య‌ర్థులు వారి ఆన్స‌ర్‌ల‌ను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఆన్స‌ర్ కీ ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీంతో వారి ఫ‌లితాల‌ను వారికి వారే ఒక అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఇక ఇదే అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్-3 ఫ‌లితాల  ఆప్షన్ పై క్లిక్ చేసి.. ముందుగా మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి పోర్టల్లోకి లాగిన్ కాగానే మీ ఫలితాలు వెల్లడవుతాయి. ఇక మీ పరీక్ష ఫలితాలను చూడొచ్చు. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Government Jobs: దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!.. కార‌ణం ఇదే..

అవ‌రోహ‌ణ విధానం..

గ్రూప్‌-3 ఫ‌లితాల వివ‌రాలు ఇలా ఉంటే.. గ్రూప్స్ పరీక్షల ఫలితాలు, పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరగగా.. గ్రూప్-3 నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించారు. ఇక గ్రూప్-2 పరీక్షలు మాత్రం డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగాయి. అయితే ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలోనే చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ స‌న్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

TGPSC News: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!

మొదటగా గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసి, పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన తర్వాతే గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసి, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇక‌ ఈ రెండు పోస్టుల భర్తీ ఆధారంగా గ్రూప్-3 ఫలితాలు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయనుంది. మెరిట్ నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags