Free Group 2 Study Material: గ్రూప్‌–2 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

విజయనగరం: ప్రతిభ, నిరంత శ్రమ విజయానికి నాందిగా నిలుస్తాయని ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.

 ఈ మేరకు గ్రూప్‌–2 పరీక్షలకు సిద్ధమవుతున్న శిక్షణార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను విజయనగరంలోని ఆనందగజపతి కళాక్షేత్రంలో ఫిబ్ర‌వ‌రి 5న‌ ఆయన ఉచితంగా అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

యుక్త వయసులోనే చదువుకోవడం సాధ్యమవుతుందని వయసు మళ్లిన తర్వాత చదువుపై పట్టు కోల్పోతామన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఏ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఉచితంగా భోజన ఏర్పాట్లు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌ కౌశిక్‌, శ్రీనివాస్‌, మండారవి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

తైక్వాండో క్రీడాకారులకు అభినందన

రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో బంగారు పతకాలు దక్కించుకుని జాతీయ పోటీల్లో పాల్గొన్న విజయనగరం క్రీడాకారులు వి.కుషాల్‌ గణదీప్‌, పి.పునీత్‌లను ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 5న‌ నగరంలోని 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుజ్జలనారాయణరావు ఆధ్వర్యంలో ఇద్దరు క్రీడాకారులు డిప్యూటీ స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిశారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు దక్కించుకున్న క్రీడాకారులు ఇటీవల ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరిగిన జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించినట్లు నారాయణరావు వివరించారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు క్రీడాకారులను అభినందించిన డిప్యూటీ స్పీకర్‌ భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని, అందుకు అవసరమైన శిక్షణతో తైక్వాండోలో రాటుదేలాలని సూచించారు.

#Tags