Group 2 Exam: పకడ్బందీగా గ్రూప్‌–2 పరీక్షలు

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో ఈనెల 25న గ్రూప్‌–2 పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని కలెక్టర్‌ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల సమాచార సౌలభ్యం కోసం కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 08562–246344 ను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ కంట్రోల్‌ రూమ్‌ కాల్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పైన పేర్కొన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే కంట్రోల్‌ రూమ్‌ స్టాఫ్‌ సహకరిస్తారన్నారు. పరీక్ష హాల్లో ఎటువంటి కాపీయింగ్‌ జరిగే అవకాశాలు ఉండవని, డిజిటల్‌ వస్తువులను అనుమతించే అవకాశం లేదన్నారు.

చదవండి: APPSC Group 2 Prelims 2024: ఈనెల 25నే గ్రూప్‌-2 పరీక్ష.. ఎస్‌బీఐ పరీక్ష వాయిదా

#Tags