Free TGPSC Group 2 Grand Tests: గ్రూప్‌–2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్‌ టెస్ట్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానం

ఆదిలాబాద్‌ రూరల్‌: టీజీపీఎస్సీ గ్రూప్‌–2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి ఉచి త గ్రాండ్‌ టెస్ట్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజాలింగు, స్టడీ సర్కిల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రూప్‌–2 అభ్యర్థులకు నాలుగు ఉచిత గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి టెస్ట్‌లో భాగంగా జూలై 8న ఉదయం 10 గంటలకు పేపర్‌–1, మధ్యాహ్నం 1.30 గంటలకు పేపర్‌–2 ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అలాగే 9న ఉదయం 10 గంటలకు పేపర్‌–3, మధ్యాహ్నం 1.30 గంటలకు పేపర్‌–4 ఉంటాయని తెలిపారు. ఇదే పద్ధతిన రెండో టెస్ట్‌ జూలై 15, 16 తేదీల్లో, మూడో టెస్టు జూలై 22, 23 తేదీల్లో, నాల్గో టెస్ట్‌ జూలై 30, 31 తేదీల్లో ఉంటాయన్నారు.

www.tgbcstudycircle. cgg. gov.in వెబ్‌ సైట్‌ ద్వారా ఈ నెల 19 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08732–221280 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

#Tags