APPSC Group 1 Prelims 2024 Selection Ratio 1: 100 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..? మెయిన్స్‌కి ఎంత మంది అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

మొత్తం 81 పోస్టుల భ‌ర్తీకి APPSC Group 1 Prelims ప‌రీక్షను నిర్వ‌హించింది. అయితే చాలా మంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కొశ్చ‌న్ పేప‌ర్‌ కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింది అంటున్నారు.

☛☛ APPSC Group-1 Prelims Paper-1 Answer Key 2024 : ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

APPSC Group 1 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి..?

అలాగే అభ్య‌ర్థుల్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2024కి ఎంత క‌టాప్ ఉండొచ్చనే సందేహం కూడా చాలా మందికి  ఉంది. అలాగే మెయిన్స్‌కి ఎంత మందిని సెల‌క్ట్ చేస్తారు.. అనుకుంటున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100 ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు తెలుపుతున్నారు. APPSC Group 1 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే .. Cut Off  Marks భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. దీంతో చాలా మంది అభ్య‌ర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవ‌కాశం ఉంది. ఇంకా దీనిపై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఈ సెలక్షన్ రేషియో పై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు సానుకులంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

☛☛ APPSC Group-1 Prelims Answer Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

APPSC Group 1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది.

☛ APPSC Group 2 Prelims Exam 2024 Selection Ratio 1:100 : గ్రూప్‌-2 ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఎంపిక నిష్పత్తి 1:100.. ఈ వ‌చ్చే వారంలోనే..

#Tags