APPSC Group 1 Ranker Success Stoires : పేదింటి బిడ్డలు.. గ్రూప్స్‌-1లో మెరుపులు.. ఒక‌రు డిప్యూటీ కలెక్టర్.. మ‌రోకరు డీఎస్పీ ఉద్యోగాలు కొట్టారిలా..

జీవితంలో ఉన్న‌త కొలువు సాధించాల‌నే ల‌క్ష్యం బలంగా ఉంటే చాలు.. దాదాపు మ‌నం స‌గం విజ‌యం సాధించిన‌ట్లే. అలాగే మ‌న గురి ఎల్ల‌ప్పుడు ల‌క్ష్యం వైపు ఉంటే.. ఏదో ఒక రోజు మ‌నం విజ‌యతీరాల‌కు చేరి తీరుతాం. స‌రిగ్గా ఇదే కోవ‌లో ఈ ముగ్గురు యువ‌కులు సాధించాల‌నే తపన, పట్టుదలతో తాము గ్రూప్‌-1 ఉద్యోగాల‌ను సాధించి.. డిప్యూటీ క‌లెక్ట‌ర్‌, డీఎస్పీ ఉద్యోగాలు సాధించి తాము క‌ల‌ల‌ను నిజం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి యువ‌కుల స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..
APPSC Group 1 Rankers Success

ఏదైనా సాధించాలనే తపన, పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు నగరానికి చెందిన యువకుడు సంగీత్‌ మాధుర్‌ నాయుడు. ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసి ఐటీ రంగంలో మంచి ఉద్యోగం చేస్తూ.. అంతకంటే మించిన హోదాలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకొని ఎట్టకేలకు చేరుకోగలిగారు. APPSC నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల్లో ప్రతిభ చాటి డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి ఎంపికై.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 

సంగీత్‌ మాధుర్‌ నాయుడు.. కుటుంబ నేపథ్యం : 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరుకు చెందిన కానాల రామకృష్ణారావు, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు సంగీత్‌ మాధుర్‌ నాయుడు. కుమార్తె సునందిని. ఈమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు.  రామకృష్ణారావు న్యాయవాది. రాజ్యలక్ష్మి గృహిణి. 

☛ APPSC Group 2 Posts Increase : 750పైగా గ్రూప్‌-2 పోస్టులు పెరిగే అవ‌కాశం.. ఇంకా..

ఎడ్యుకేష‌న్ :
సంగీత్‌ మాధుర్‌ నాయుడు.. స్థానిక వాణీ పబ్లిక్‌ స్కూలులో ప్రాథమిక విద్య, చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివారు. సీఆర్‌ఆర్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వ‌దిలి.. గ్రూప్‌-1 వైపు వ‌చ్చా..

సంగీత్‌ మాధుర్‌.. 2012లో ఒక ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. చదువుకునే రోజుల్లోనే ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. లక్ష్య సాధనకు తొలుత సివిల్స్‌ రాశారు. అందులో అర్హత సాధించలేక పోయారు. అయినా పట్టు విడవకుండా అయిదుసార్లు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగారు. ఐఏఎస్‌ కావాలనే ఆశయం నెరవేరకపోయినా పట్టు వదలలేదు. గ్రూప్‌-1 పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2022లో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎట్టకేలకు డిప్యూటీ క‌లెక్ట‌ర్ కొట్టాడు.

ఏదైనా ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని సాధించాలంటే విలాసాలకు దూరంగా ఉండాలి. తోటివారు సినిమాలు, షికార్లకు వెళ్తుంటే  మనం కూడా వారితో పాటు వెళ్దామని ఆశపడితే లక్ష్య సాధనలో వెనుకబడినట్లేననేది నా అభిప్రాయం.  ఎంత కష్టమైనా సరే నాలుగు గోడల మధ్య ఒక్కరే ఉండి చదువుకోగలిగితేనే విజయం వరిస్తుంది’ అని సంగీత్‌ మాధుర్‌ తెలిపారు.

నా ల‌క్ష్యం ఇదే.. : జయకృష్ణ, డీఎస్పీ

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి కడలి హిమవతి, రామనాగ గోవిందరాజు దంపతుల కుమారుడు జయకృష్ణ. ఈయ‌న గ్రూప్‌-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగం సాధించారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌ 1&2..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

ఎడ్యుకేష‌న్ :
జయకృష్ణ 6, 7 తరగతులు విశాఖపట్నం, 8 ,9, 10 తరగతులు వేలివెన్ను శశి పాఠశాల, ఇంటర్‌ హైదరాబాద్‌లో చదివారు. ఉత్తరాఖండ్‌ రూర్కీలో ఐఐఐటీ చదువుతుండగా సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగం వచ్చింది.

సివిల్స్ కోసం..
దిల్లీలో శిక్షణలో ఉండగానే గ్రూప్‌-1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. సివిల్స్‌ పరీక్షల్లో విజయం సాధించడమే తన లక్ష్యమని, ఈ మేరకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. జయకృష్ణను సిద్ధాంతం సర్పంచి సీహెచ్‌ గనిరాజు, గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించారు.

☛ APPSC Group-1 First Ranker Rani Susmita Interview : గ్రూప్‌-1 ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఇలా చ‌దివితే..

మా నాన్న రైతు.. రెక్కల కష్టంతో.. 

తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన చావా బాల మహేశ్‌ గ్రూప్‌-1 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. అతని తండ్రి రామకృష్ణ రైతు. తల్లి నాగలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. రామకృష్ణ తన చిన్నతనంలో చదువుకోలేకపోవడంతో కుమారుడు, కుమార్తెను ఉన్నత చదువులు చదివించి మంచి స్థానంలో నిలబెట్టాలన్న ఆశయంలో తనకున్న ఒక ఎకరా భూమి సాగు చేస్తూ రోజు వారీ వ్యవసాయ కూలీగా పని చేసేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రెక్కల కష్టంతో పిల్లలను బాగా చదివించారు. కుమార్తె కూడా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు.

☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎడ్యుకేష‌న్ : 
జగన్నాథపురం గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. అలాగే మహేశ్‌ భీమవరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆపై ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమవుతున్నారు. 

తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌-1 కొట్టానిలా..
సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో మహేశ్‌ దిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌-1 పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే సత్తాచాటి డీఎస్పీగా ఎంపికయ్యారు. కుమారుడు డీఎస్పీకి ఎంపికవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

#Tags