TSPSC Group-1 Mains Exam Schedule Released: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పులు చేస్తూ అప్‌డేట్‌

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరు 21వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. అక్టోబరు 27వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయని టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా జూన్ నెలలోనే విడుదల చేసింది. తాజాగా మెయిన్స్ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

TS Constable and SI Jobs Notification 2024 Date : 15000ల‌కు పైగా కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాలు నోటిఫికేష‌న్.. ఎప్పుడంటే..? ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్యం 2.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటుంది. 5.30 గంటలకు పూర్తి అవుతుంది. ఇందులో స్వల్ప మార్పులు చేసింది టీజీపీఎస్సీ. మధ్యాహ్నం 2 గంటలకే పరీక్ష ప్రారంభం అవుతుందని తాజా ప్రకటనలో పేర్కొంది.

IIT Madras: దేశంలోనే టాప్‌-1గా ఐఐటీ మద్రాస్‌..ఎందుకంత స్పెషల్‌? ప్లేస్‌మెంట్స్‌ కారణమా?

సాయంత్రం 5 గంటలకు పూర్తి అవుతుందని వెల్లడించింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరింది. ఇక, మెయిన్స్‌ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నారు. 

గ్రూప్ -1 మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్..
అక్టోబ‌ర్ 21 – జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
అక్టోబ‌ర్ 22 – పేప‌ర్ 1(జ‌న‌ర‌ల్ ఎస్సే)
అక్టోబ‌ర్ 23 – పేప‌ర్ 2(హిస్ట‌రీ, క‌ల్చ‌ర్, జియోగ్ర‌ఫీ)
అక్టోబ‌ర్ 24 – పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం, గ‌వ‌ర్నెన్స్‌)
అక్టోబ‌ర్ 25 – పేప‌ర్ 4(ఎకాన‌మీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్)
అక్టోబ‌ర్ 26 – పేప‌ర్ 5(సైన్స్ అండ్ టెక్నాల‌జీ, డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్)
అక్టోబ‌ర్ 27 – పేప‌ర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేష‌న్)

#Tags