గ్రూప్‌–1 మెయిన్స్‌కు 182 మంది ఈ స్టడీ సర్కిల్‌కి అభ్యర్థులు అర్హత

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వశాఖల్లో గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న 182 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.అలోక్‌ కుమార్‌ తెలిపారు.
గ్రూప్‌–1 మెయిన్స్‌కు 182 మంది ఈ స్టడీ సర్కిల్‌కి అభ్యర్థులు అర్హత

మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా బీసీ స్టడీ సర్కిల్‌ మెయిన్స్‌కు ఉచిత కోచింగ్‌ నిర్వహిస్తోందని, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిల్స్‌ పరిధిలో 300 మంది, హైదరాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో రెండు వందల మంది అభ్యర్థులకు కోచింగ్‌ తరగతులు జనవరి 25వ తేదీ నుంచి మొదలుకానున్నట్లు తెలిపారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రి­లి­మ్స్‌ కోచింగ్‌ తీసుకుని మెయిన్స్‌కు ఎంపికైన అ­భ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైపండ్, స్టడీ మెటీరియల్‌ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. 

#Tags