Japan Rocket Experiment: జపాన్‌ ప్రయోగం.. ఆవుపేడతో రాకెట్‌ తయారీ!

జపాన్‌ రాకెట్‌ పరిశోదనో భాగంగా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా అక్కడి ఇంజనీర్లు తమ రాకెట్లను ఏకంగా ఆవుపేడతో పని చేసే విధంగా తయారు చేశారు. పూర్తి వివరాలు..

అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో అద్బుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.

Tesla unveils Optimus Gen 2: కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ జెన్ 2ను ఆవిష్కరించిన టెస్లా

జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్‌పోర్ట్‌ ద్వారా ఆవుపేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజవనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది.  సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే.. బయోమీథేన్‌తో అతి తక్కువ ఖర్చులో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి. 

ISRO astronaut's Moon Mission: చందమామపై భారతీయ వ్యోమగాముల అడుగే తరువాయి!

#Tags