Supreme Court: అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వని సుప్రిం కోర్టు..!

ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్‌ పేపర్‌ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపంకర్‌ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్‌ 24న విచారించింది.  

Mines Ministry: శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న గనుల మంత్రిత్వ శాఖ

#Tags