Telangana Runa Mafi Guidelines 2024 : రూ.2 లక్షల రుణమాఫీ వీరికి మాత్ర‌మే.. నేరుగా అకౌంట్లోకి డబ్బులు ఇలా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలను జూలై 15వ తేదీన (సోమ‌వారం) ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల రుణాలున్న బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో(చిన్న విలువ నుంచి పెద్ద విలువ) రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే కుటుంబానికి రూ. 2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంద‌న్నారు. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమకానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు.

☛ Rs.3000 AP Unemployment Allowance : ఇక రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తాంటే ..? అలాగే జాబ్‌ క్యాలెండర్ కూడా..

వీరికి రుణమాఫీ వర్తించదు..
రీషెడ్యూల్ చేసిన రుణాలకు రూ.2లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పీఏసీఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి. SHG, JLG, RMG, LECS రుణాలకు వర్తించదని తెలిపింది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

రూ.2 లక్షలకు పైగా లోన్ ఉంటే..?

ఒక రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫీ చేస్తుంది. ఏ కుటుంబానికైతే రూ.2 లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హతగల రూ.2 లక్షలను రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఉదాహరణకు మీకు రూ.2.50 లక్షల లోన్ ఉంటే రూ.50 వేలను మీరు కట్టాల్సి ఉంటుంది. మిగతా రూ.2 లక్షలు మాఫీ అవుతాయి.

☛ Thalliki Vandanam Scheme New Rule : మీ పిల్లల‌కు రూ.15000 రావాలంటే.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే..!

#Tags