Earthquakes in Nepal: నేపాల్‌లో తరచూ వ‌చ్చే భూకంపాలకు కార‌ణం ఏంటో తెలుసా

హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. ఈ విపత్తులో 70 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.

ఈ భూకంప ప్రభావం భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కనిపించింది. నేపాల్‌లో గతంలోనూ అనేక భూకంపాలు సంభవించాయి. 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపంలో ఎనిమిది వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? శాస్త్రవేత్తలు దీనిపై ఏమంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Indians Arrested in America: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులు పట్టివేత

నేపాల్ భౌగోళిక స్వరూపమే తరచూ భూకంపాలు సంభవించడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్‌లో 17 శాతం ప్రాంతం మాత్రమే మైదానం. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. నేపాల్‌ ఉత్తర చివరలో ఎత్తయిన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నేపాల్ తరచూ భూకంపాలకు ఎందుకు గురవుతుందో తెలసుకోవాలంటే ముందుగా భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. 

భూమి అనేది భారీ టెక్టోనిక్ ప్లేట్‌లతో రూపొందింది. భూమిలోపలి ఈ టెక్టోనిక్ ప్లేట్లు వివిధ పరిస్థితుల కారణంగా కదులుతూ ఉంటాయి. అలాగే ఒకదానికొకటి ఢీకొంటాయి. నేపాల్.. రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. నేపాల్ ఇండో-ఆస్ట్రేలియన్, యురేషియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ రెండు ప్లేట్లు ఢీకొన్నప్పుడు నేపాల్‌లో భూకంపాలు సంభవిస్తుంటాయి.

ఈ రెండు ప్లేట్లు ప్రతి సంవత్సరం ఐదు సెంటీమీటర్ల చొప్పున ఒకదానిపైకి మరొకటి ఎక్కేలా కదులుతున్నాయి. ఫలితంగా నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ఐదు సెంటీమీటర్ల వేగం చిన్నదిగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని చెబుతారు. నేపాల్‌కు ఉన్న మరో పెద్ద సమస్య అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి బలమైన భూప్రకంపనలను తట్టుకోలేవు. భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ఇదే ప్రధాన కారణం. 

 

Earthquake in Indonesia: ఇండోనేసియాలో భూకంపం

#Tags