Plastic pollution: ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ..

నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ వల్ల వచ్చే కొన్ని నష్టాలివీ..
Plastic pollution: ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ..
  • భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది
  • క్లోరినేటెడ్‌ ప్లాస్టిక్‌తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి.
  • ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్‌ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్‌ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు.

    Also read: Climate Change: మన పాపం! ప్రకృతి శాపం!!
     
  • మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్‌ వ్యర్థాలను కూడా కనుగొన్నారు.
  • బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్‌ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. 

    Also read: Astronomy: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీ పేరు?
     
  • ప్లాస్టిక్‌లో బిస్‌ఫినాల్‌–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌ (పీఏహెచ్‌), పాలీక్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌ (పీసీబీస్‌), స్టైరిన్‌ మోనోమర్, నానిల్ఫెనాల్‌ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని నిరోధిస్తాయి.  పునరుత్పత్తి సామర్థ్యాన్ని  దెబ్బతీస్తాయి.  
#Tags