ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసీసీ) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహిస్తుంది. "ఐ యామ్ ఐ విల్" - వ్యక్తిగత కథలు, క్యాన్సర్‌ను ఓడిస్తానని వాగ్దానాలు అనేది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2019-2021 థీమ్.
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌జీడీ-3.4)కు అనుగుణంగా చికిత్స ద్వారా సంక్రమించని వ్యాధుల అకాల మరణాలను మూడింట ఒక వంతు తగ్గించడం, 2030 నాటికి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం లక్ష్యం. క్యాన్సర్‌ని నివారించడానికి అంతర్జాతీయ సమాజం ఐక్యమవడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా మరణిస్తున్న లక్షలాది మందిని కాపాడేందుకు క్యాన్సర్‌పై అవగాహన పెంచేలా ప్రభుత్వాలు, వ్యక్తులను ప్రోత్సహించడం ఈ రోజు ఉద్దేశం.
సాధారణ పరిమితికి మించి పెరుగుతూ ఇతర అవయవాలపై దాడి చేసే అసాధారణ కణాల ద్వారా ఏర్పడిన అనేక వ్యాధుల సముహానికి పేరు క్యాన్సర్. ఇది ప్రపంచవ్యాప్తంగా మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో రెండో స్థానంలో ఉంది. దీని కారణంగా 2018లో 9.6 మిలియన్ల మంది చనిపోతారని అంచనా. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్యాన్సర్ కంట్రోల్ (యుఐసీసీ)ని ప్రపంచ ఆరోగ్య సమాజానికి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయడానికి రూపొందించిన సభ్యత్వ సంస్థ. దీన్ని 1933లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.