జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

భారతదేశంలో ప‌త్రిక‌ల‌ స్వేచ్ఛ, బాధ్యతకు గుర్తుగా ఏటా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు.

 ఈ రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఉన్నత నైతిక వాచ్ డాగ్‌లాగా పనిచేయడం ప్రారంభించిన రోజుకు గుర్తుగా దీన్ని ఏర్పాటు చేశారు. ప‌త్రిక మంచి ప్రమాణాలు, విలువ‌ల‌తో ముందుకు సాగుతూ ఎటువంటి ప్రభావం లేదా బెదిరింపులకు గురికాకుండా చూసుకోడానికి దీన్ని ఉద్ధేశించారు.

ముఖ్యాంశాలు:

  • 1956లో మొదటి ప్రెస్ కమిషన్ దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేసింది. జూలై 4, 1966న ప్రెస్ కౌన్సిల్ స్థాపించారు. కాగా ఇది 16 నవంబర్ 1966 నుంచి ప‌ని చేయ‌డం ప్రారంభించింది. అందువల్ల ఏటా నవంబర్ 16ను జాతీయ పత్రికా దినోత్స‌వంగా జరుపుకుంటారు.
  • 2020 ఏప్రిల్‌లో విడుదలైన గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ప్రకారం, 180 దేశాలలో భారత్ 140వ స్థానంలో ఉంది.
#Tags