ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం
ప్రతి ఏడాది ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
యునెస్కో ఈ కార్యక్రమ బాధ్యతను తీసుకుంటోంది. యునెస్కో ప్రజలలో ముఖ్యంగా యువతలో పుస్తక పఠన ఆసక్తిని పెంపొందించడమే కాక, రచయితలు, ప్రచురణకర్తల సమస్యలను తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. రచనల ప్రపంచంలో కాపీరైట్ అనేది అతి పెద్ద సమస్య. పుస్తక దినోత్సవం సందర్భంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అంతేకాదు ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం మాత్రమే కాక కాపీరైట్ దినోత్సవం అని కూడా పిలుస్తారు.
చరిత్ర:
మొట్టమొదట ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఏప్రిల్ 23 , 1995న జరుపుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్సిపియర్ జననం, మరణం ఒకే రోజు కావడంతో యునెస్కో ఈ తేదిని నిర్ణయించింది. అంతేకాక స్పానిష్ రచయిత మిగ్యుల్ డి సెర్వంటెస్ వర్థంతి కూడా ఇదే రోజు. స్పానిష్ సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజు పుస్తక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 23న స్పెయిన్‌లో ఈ రోజును ‘ది రోజ్‌డేగా’ జరుపుకుంటారు. ‘వాలేంటైన్స్ డే’ మాదిరిగా ప్రజలు గూలాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు. 1926లో స్పానిష్ ప్రఖ్యాత రచయిత మిగ్యుల్ డి సెర్వంటెస్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా ప్రజలు గులాబీలకు బదులుగా పుస్తకాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. ఆ సంప్రదాయం ఈ రోజుకి కొనసాగుతోంది. ఆ విధంగా ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం ఆలోచనకు బీజమేర్పడింది.
దినోత్సవానికి తగట్టుగానే ఈ రోజు పుస్తకాలు, రచనల గురించే కాకుండా ప్రజల్లో పుస్తక పఠన ఆసక్తిని కలిగించడానికి యునెస్కో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

#Tags