Black Taj Mahal: ప్రేమకు చిహ్నం.. నల్లరాతి తాజ్ మహల్! అది ఎక్కడుంది?

ఆగ్రాలోని పాలరాతి తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

అయితే.. మన దేశంలోనే మరో నల్లరాతి తాజ్ మహల్ కూడా ఉందని చాలామందికి తెలియదు. ఈ నల్లరాతి తాజ్ మహల్ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ కథనంలో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

ఇది ఉన్న‌ది ఇక్క‌డే.. 
నల్లరాతి తాజ్ మహల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక నగరం బుర్హాన్‌పూర్‌లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను చూసిన తరువాతే ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు.

ఎవరి సమాధి అంటే..
బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఉన్న ఈ నల్లరాతి తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ మనవడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతని మరణం తరువాత కొంతకాలానికి అతని భార్య కూడా మరణించింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. 1622-1623 మధ్య కాలంలో జహంగీర్ ఈ ఇద్దరి జ్ఞాపకార్థం ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను నిర్మించాడు.

దీని ప్రత్యేకతలు ఇవే..
ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే నల్లరాతి తాజ్ మహల్ చిన్నది.
నల్లరాతితో నిర్మించబడిన ఈ తాజ్ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు.
ఈ తాజ్ మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది.
దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి.

What Is VSHORADS: వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్కడ ఉపయోగిస్తారు?

నల్లరాతి తాజ్ మహల్ చూడటానికి మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ తాజ్ మహల్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒక అద్భుతమైన కట్టడం.

ముగింపు..
ఆగ్రాలోని తాజ్ మహల్ మాత్రమే కాకుండా, బుర్హాన్‌పూర్‌లోని నల్లరాతి తాజ్ మహల్ కూడా ఒక అద్భుతమైన కట్టడం. షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా నిలిచే ఈ తాజ్ మహల్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒక ప్రదేశం.

#Tags