What Is VSHORADS: వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్కడ ఉపయోగిస్తారు?
ది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి? దీనిని ఎక్కడ ఉపయోగిస్తారు? VSHORADS ముఖ్య ఫీచర్స్ ఏంటి అన్నది ఓసారి తెలుసుకుందాం.
1. VSHORADS అంటే ఏమిటి?
జ: VSHORADS అంటే ది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది దేశీయంగా రూపొందించిన మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPADS)
2. VSHORADSను ఎవరు అభివృద్ధి చేశారు?
జ: DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్),రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) దీనిని అభివృద్ధి చేసింది.
3. VSHORADS ఫీఛర్స్ ఏంటి?
జ: ఇది డ్యుయెల్-థ్రస్ట్ సాలిడ్ రాకెట్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్,రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (RCS) ప్రకారం పనిచేస్తుంది. ఇందులో అత్యాధునికమైన అన్‌కూల్డ్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ ఉంది.
4. దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి?
జ: VSHORADS తక్కువ-ఎత్తులో ఉన్న వైమానిక ప్రమాదాలను కనుగొంటుంది.
5. VSHORADS ఎందుకు ముఖ్యమైనది?
జ: సరిహద్దు ఉద్రిక్తతలు వంటి భౌగోళిక-వ్యూహాత్మక సవాళ్లను పరిష్కరించడంలో VSHORADS ముఖ్య పాత్ర పోషిస్తుంది. మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో, శత్రు యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లను గుర్తించగలదు.