Union Budget: ఆర్థికమంత్రి అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడ‌తారో మీకు తెలుసా?

బడ్జెట్‌ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు.

కానీ.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. 

ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22వ తేదీ అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై పడింది.

ఇదే మొదటిసారి..
1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28వ తేదీ బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.

నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్‌లను సమర్పించారు.

BUDGET Update: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. బడ్జెట్‌లో ఆ ప్రకటన ప్రకటించే అవకాశం.. ఏదంటే..?

1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె బడ్జెట్‌లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు. 

ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్‌. జూలై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది.

TS Budget Updates: జూలై 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

#Tags